TS : కిర్గిస్తాన్ పరిస్థితులపై రేవంత్ రెడ్డి ఆరా

TS : కిర్గిస్తాన్ పరిస్థితులపై రేవంత్ రెడ్డి ఆరా
X

కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో చోటు చేసుకుంటున్న ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆరా తీశారు. భారతీయ విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని భారత విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపినట్టు సీఎంఓ తెలిపింది. బిష్కెక్‌ లో జరుగుతున్న పరిణామాలపై సిఎం అడిగిన తర్వాత.. సీనియర్ అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీని సంప్రదించి వివరాలు సేకరించినట్లు సీఎం సిపిఆర్‌ఓ ట్విట్టర్ లో తెలిపారు.

అక్కడి పరిస్థితి మెరుగుపడకపోతే భారతీయ విద్యార్థులను తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. భారతీయ విద్యార్థులు తమను తాము రక్షించుకోవడానికి హాస్టల్స్ లోనే ఉంటున్నారని.. ఆహారం వారికి అందుబాటులో లేదో అని ఆందోళన వ్యక్తం చేశారు.

మే 18న.. కిర్గిస్థాన్ రాజధాని నగరం కొంతమంది స్థానికులు, విదేశీయుల మధ్య గొడవలు జరిగాయి. బిష్కెక్‌లోని విద్యార్థులను బయటకు రావద్దని భారతదేశ విదేశాంగ శాఖ కోరింది. మధ్య ఆసియా దేశంలోని భారత రాయబార కార్యాలయం భారతీయ విద్యార్థులతో టచ్‌లో ఉందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపింది.

Tags

Next Story