TS : రేవంత్ రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండే.. కౌశిక్ రెడ్డి సంచలనం

TS : రేవంత్ రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండే.. కౌశిక్ రెడ్డి సంచలనం

వరుస విమర్శలతో జోరుమీదున్న కాంగ్రెస్ (Congress) పై బీఆర్ఎస్ (BRS) నేతలు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండే అవుతాడంటూ BRS MLA పాడి కౌశిక్‌ రెడ్డి బాంబ్ పేల్చారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందిన్నారు కౌశిక్ రెడ్డి. ఆ కేసును తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియా పాయింట్లో ఫైరయ్యారు. ఏక్‌నాథ్ షిండే అవుతాడంటూ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు పాడి కౌశిక్‌ రెడ్డి.

కాంగ్రెస్‌ ప్రభుత్వం 5 సంవత్సరాలు పని చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ కోరుకుంటుందని అన్నారాయన. ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇచ్చారు? భర్తీ ఎప్పుడు జరిగిందని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకి రివర్స్‌ అయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story