CM Revanth Reddy Hot Comments : రియల్ ఎస్టేట్‌పై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

CM Revanth Reddy Hot Comments : రియల్ ఎస్టేట్‌పై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
X

గత 6 నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ( Revanth reddy) స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, భరోసాతో స్థిరాస్తి రంగం పురోగమిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో ఈ రంగం మరింత ఆశాజనకంగా మారనుందని ట్విట్టర్ వేదికగా ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బహిరంగ మార్కెట్లో విజృంభిస్తోందని, దేశీయ, గ్లోబల్ ఆఫీస్ లీజింగ్ స్పేస్ రెండింటిలోనూ డిమాండ్ 40 శాతం పెరగడం అందుకు నిదర్శనమని ట్వీట్ ద్వారా సీఎం రేవంత్ వెల్లడించారు. ఈ వృద్ధికి, సాధిస్తున్న ఫలితాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక విధానమే కారణమని స్పష్టం చేశారు. రాబోయే కొన్నేళ్లలోనే తదుపరి లక్ష్యాన్ని చేరుకుంటామని, హైదరాబాద్ ను పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో ప్రతిఒక్కరికీ అవకాశాలను సృష్టిస్తామని భరోసా ఇచ్చారు.

Tags

Next Story