TS : కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రేవంత్ రెడ్డి ప్రశంసలు

భువనగిరిలో రోడ్ షో సందర్భంగా కోమటిరెడ్డి అభిమానులను రంజింపచేసేలా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. తనతో పాటు సీఎం అయ్యే అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డే నని చెప్పి ఆయన అభిమానులందరితో శెభాష్ అనిపించుకున్నారు. కష్ట నష్టాల్లో పేదలకు సేవలు అందించడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మంచి పేరుందని చెప్పారు.
ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే మంత్రి పదవి తీసుకుంటానని చెప్పి నల్లగొండ పోరాట యోధుడు వెంకట్ రెడ్డి అని రేవంత్ రెడ్డి కొనియాడారు. జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి భూమికి మూరెడు లేని సన్నాసి.. మంత్రి పదవికోసం కాకాపడుతున్నారని.. రాజగోపాల్ రెడ్డినే విమర్శిస్తున్నాడని ఫైరయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ దొరగారి దొడ్లో దొరకు సారాలో సోడాపోసి రాజకీయాలలోకి రాలేదు.. రక్తాన్ని చెమటగా మార్చి.. భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి రాజకీయాల్లో పైకి వచ్చారన్నారు.
"నాతో పాటు ఎవరికైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే.. అది కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికే ఉంది. అధిష్టానం ఆదేశాల ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాను. ముఖ్యమంత్రి పదవిని నేను ఎప్పుడూ బాధ్యతతో చూసానే తప్ప.. అహంకారంతో చూడలేదు. ముఖ్యమంత్రి కాకముందు కలిసినట్టే.. ఇప్పుడూ ప్రజల్ని కలిస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నాం" అని రేవంత్ చెప్పిన మాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com