TS : రేవంత్ రెడ్డి మగాడని నిరూపించుకోవాలి- కేటీఆర్

TS : రేవంత్ రెడ్డి మగాడని నిరూపించుకోవాలి- కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి మగాడైతే ఆగస్టు 15న రూ. రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8-10 సీట్లు గెలిస్తే ఏడాదిలోగా కేసీఆర్ రాష్ట్రాన్ని మరోసారి శాసిస్తారని అన్నారు. కేసీఆర్ ను ఖతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

మంగళవారం కేటీఆర్ గద్వాల జిల్లా అలంపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ , వరంగల్ బీ ఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ తరఫున వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, మాట్లాడారు. రూ.2 వేల పెన్షన్ను రూ.4వేలు చేయాలి.. ప్రతి ఆడ బిడ్డకు రూ.2,500 ఇయ్యాలి' అని కేటీఆర్ సవాల్ విసిరారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 14 సీట్లలో వెంట్రుక వాసిలో ఓటమి చెందామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులు వస్తా యని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చని చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిం దని, వంద రోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పై ఉన్న భ్రమలు తొలగిపోయాయని పేర్కొన్నారు. సూటిపోటి మాటలతో కేసీఆర్ను ఇక్కడ, తన చెల్లె కవితను మోదీ జైల్లో పెట్టి అక్కడ వేధిస్తున్నారని అన్నారు.

Tags

Next Story