TS : రేవంత్ స్పీడు.. అభ్యర్థుల ప్రకటన లేటు..

TS : రేవంత్ స్పీడు.. అభ్యర్థుల ప్రకటన లేటు..

తెలంగాణలో (Telangana) లోక్ సభ రేసు హీటెక్కించిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. బీఆర్ఎస్ ను (BRS) డీలా పడేయడం.. లోక్ సభ పోరులో బలంగా ఉండే బీజేపీని (BJP0 సవాల్ చేసి కాంగ్రెస్ ను (Congress) రేసులో పెట్టారు రేవంత్ రెడ్డి. ఐతే.. అభ్యర్థుల ప్రకటనలో మాత్రం కాంగ్రెస్ వెనుకబడిపోయింది. తెలంగాణలో ఒక్క కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేశాయి.

బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల్ని ప్రకటించింది. కేసీఆర్ కొంత ఊగిసలాడినా అభ్యర్థులను ఫటాఫట్ ఫైనలైజ్ చేసేశారు. వీలైనంత వరకూ బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్సే ఎటూ తేల్చుకోలేకపోతోంది. సొంత బలం మర్చిపోయి… ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్లు కేటాయిస్తోంది.

9 సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. భువనగిరి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలకు అభ్యర్థుల్నిప్రకటించాల్సి ఉంది. హైదరాబాద్ నియోజకవర్గానికి సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్‌ను ప్రకటిస్తారని భావించినా మజ్లిస్ కు సహకరించేందుకు హిందూ అభ్యర్థిని పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. భువనగిరి నుంచి చామల కిరణ్‌రెడ్డి అభ్యర్థిత్వంపై కోమటిరెడ్డి సోదరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ టికెట్ కూడా వెయిటింగ్ లో ఉంది. అయినా సిట్టింగ్ బీఅర్ఎస్ ఎంపీని చేర్చుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నుంచి అభ్యర్థులు రెడీగా ఉన్నా.. వారంతా బలమైన వాళ్లు కాదని.. వేరే పేర్లను పరిశీలిస్తూ ఆలస్యం చేస్తున్నారు. ఎలా చూసినా అన్నీ స్థానాలకూ రెడ్డి పేర్లే తెరపైకి వస్తున్నాయి. ఖమ్మం కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖరారు చేయనున్నారు. ప్రచారం బాధ్యత రేవంత్ రెడ్డిదే కాగా.. అభ్యర్థులు తేలితే మాత్రం పోరు రసకందాయంలో పడటం ఖాయం.

Tags

Read MoreRead Less
Next Story