TS : ఓటుకు నోటు కేసుతోనే నాపై రేవంత్ కుట్ర: కేసీఆర్

TS : ఓటుకు నోటు కేసుతోనే నాపై రేవంత్ కుట్ర: కేసీఆర్
ఓటుకు నోటు కేసులో పట్టుకున్నందుకే సీఎం రేవంత్ రెడ్డి తనపై ప్రతీకారం తీర్చుకోవాలన్న దురుద్దేశంతో ఉన్నారని, అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నరని మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.

ఓటుకు నోటు కేసులో పట్టుకున్నందుకే సీఎం రేవంత్ రెడ్డి తనపై ప్రతీకారం తీర్చుకోవాలన్న దురుద్దేశంతో ఉన్నారని, అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నరని మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరంపై కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను ఎప్పటికప్పుడు బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తున్నరని ఆరోపించారు. తన కండ్ల ముందే తెలంగాణను నాశనం చేస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలను బలిపెడతానంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు కేసీఆర్ . మూడున్నర కోట్ల టన్నుల పండిన పంట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆనాడు ఎప్పుడైనా నీళ్లు వచ్చినయా? యూపీలో, బీహార్లో అమెరికాలో డ్యామ్లు కొట్టుకపోయిన. కోమటిరెడ్డి బ్రదర్స్ కట్టిన మిడ్ మానేర్ కొట్టుకపోతే మేం వాళ్లని జైల్లో వేసినమా? అని అన్నారు. మేం చిల్లర రాజకీయాలు చేయలేదన్నారు కేసీఆర్.

మా పథకాలు ప్రజలు మరువలేనివని అన్నారు కేసీఆర్. 60 వేల కోట్లతో ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ ను మూడు లక్షల కోట్ల బడ్జెట్ కు పెంచామన్నారు.. వైయస్సార్ సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 'ఆరోగ్యశ్రీ' 'ఫీజు రియంబర్స్ లను మేం కొనసాగించామని గుర్తుచేశారు. దాని మీద కేసీఆర్ కిట్, అమ్మవొడి, బస్తీ, పల్లె దవాఖానాల వంటి వాటితో ఇంప్రూవ్డ్ చేశామని వెల్లడించారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులను, నీళ్లను మేం వాడమని వదిలేసినమా? అని ప్రశ్నించారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అతిచిన్న లోపాన్ని సరిదిద్ది ఉపయోగించకుంటే ప్రజా ఉద్యమం తప్పదని... మేం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలకుల రంగు పూర్తిగా బయట పడాలంటే, వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే రేవంత్ ప్రభుత్వం ఐదేళ్ళపాటు పనిచేయాల్సిందేనని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Tags

Next Story