TS : తీన్మార్ మల్లన్నను గెలిపించి తీరాలన్న రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించేలా కలిసికట్టుగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. గెలుస్తామన్న ధీమా వద్దనీ, అలసత్వమసలే వద్దనీ, వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేయాలని సూచించారు.
బుధవారం ఉమ్మడి వరంగల్- నల్గొండ - ఖమ్మం జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్ల మెంట్ ఇన్చార్సీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు.
ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉందనీ, ఈ రెండు రోజులు ప్రతిపట్టభద్రుడిని కలిసేందుకు ప్రయత్నించాలని, ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలను వివరించాలని సూచించారు రేవంత్. మల్లన్న నిరుద్యోగులు, విద్యార్థులకు... ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారని రేవంత్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com