TS : జూన్ 2న కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సన్మానం?

TS : జూన్ 2న కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సన్మానం?
X

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సన్మానించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ పదేళ్ల ఆవిర్భావ వేడుకల ఆహ్వానికి కేసీఆర్ వస్తే కనుక ఈ సన్నివేశం కనిపించే చాన్స్ ఉంది. తెలంగాణ సాధనలో అత్యంత కీలక వ్యక్తిగా కేసీఆర్ ను గుర్తించి సన్మానించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణంచింది. వేలాదిమంది ఉద్యమించినా, ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి సోనియాతోపాటు కేసీఆర్ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపాలని నిర్ణయంచుకున్నట్లుగా తెలుస్తోంది.

జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారుకు ప్రభుత్వపరంగా భారీ వేడుక నిర్వహించనున్నారు. అవతరణ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో పదివేలమందితో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేయనుంది. జయ జయహే గీతాన్ని కూడా అదే రోజున ఆవిష్కరించనుంది. తెలంగాణ ఉద్యమకారుల్ని గౌరవించేందుకు రేవంత్ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది

Tags

Next Story