TS : రేవంత్ కుర్చీ ఉండదు.. అర్వింద్ మరో సంచలనం

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు (Telangana Parliament Elections) రచ్చ రేపుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన .. బహిరంగ సభలో పాల్గొని సంచలన కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందో.. పోతుందో తెలియని వ్యాఖ్యానించారు.
సీఎం కుర్చీని రేవంత్‌రెడ్డి నుంచి కోమటిరెడ్డి లాక్కుంటారని చెప్పారు అర్వింద్. అంతేకాదు.. కోమటిరెడ్డి తర్వాత సీఎం కుర్చీని లాక్కునేందుకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో పదవుల కోసం కొట్లాడేవారు ఉన్నారు తప్ప.. ప్రజలకు మంచి చేయాలనుకునే నాయకులు లేరని ధర్మపురి అర్వింద్ కామెంట్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తోవలో నడుస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అన్న అర్వింద్.. రేవంత్‌రెడ్డి, కవిత ఇద్దరూ ఒకటే అని చెప్పారు. ఇద్దరూ కలిసి నిజామాబాద్ అభ్యర్థిని డిసైడ్ చేస్తారని కామెంట్ చేశారు. రైతుబంధు నిధుల జమ చేయడంలో కాంగ్రెస్ అవినీతి చేస్తోందని... కోమటిరెడ్డి రూ.2వేల కోట్లు, పొంగులేటి రూ.3వేల కోట్లు బిల్లుల కింద తీసుకున్నారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com