ATM Robbery : దొంగలు బీభత్సం.. ఏటీఎం కొల్లగొట్టి రూ.29 లక్షలు ఎత్తుకెళ్లారు

మహబూబాబాద్ జిల్లాలోని (Mahabubabad district) బయ్యారంలో (Bayyaram) దొంగలు కలకలం సృష్టిస్తున్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ దగ్గరున్న ఎస్బీఐ ఏటీఎంలో (ATM) శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఏటీఎం మిషన్ ను పగులగొట్టి రూ.29 లక్షలు కొట్టేశారు. అయితే ఆదివారం ఉదయం ఏటీఎంలో డబ్బులు తీసుకుందామని వచ్చిన వారు మిషన్ పగిలి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోటీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏటీఎంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారు.అందులో దొంగలు నల్ల రంగు కారులో వచ్చారని, గ్యాస్ కటర్ ద్వారా చోరీకి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణ చేశారు.
అనంతరం అక్కడకు చేరుకున్న క్లూప్ టీం ఏటీఎంలో దొంగల వేలిముద్రల సహా పలు ఇతర ఆధారాలను సేకరించారు. ఈ దొంగతనానికి పాల్పడిన వారిని గుర్తించామని, ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్బీఐ బయ్యారం బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ వివరణ కోరగా.. బయ్యారం ఏటీఎంలో సర్వీస్‌కు సంబంధించిన విషయాలను ఇల్లందు నుండి చూస్తారని మాకు ఏమి సంబంధం లేదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com