TG : రూ.2లక్షల రుణమాఫీ.. రేషన్‌కార్డు లేనివారికి గుడ్‌న్యూస్

రేషన్ కార్డు లేని రైతులెవరూ ఆందోళన చెందొద్దని, వారికి కూడా రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రుణం ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగదన్నారు. రేషన్ కార్డు నిబంధన కేవలం కుటుంబ నిర్ధారణ కోసమేనని, కార్డు లేని వారి గురించి వ్యక్తిగత విచారణ చేపడతామన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? ఎవరి పేరిట రుణం ఉందనే వివరాలను పరిశీలించి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రుణమాఫీకి PM కిసాన్ మార్గదర్శకాలనే పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఐటీ చెల్లింపుదారులకు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే పిల్లల చదువులు, స్టడీ, హౌసింగ్ లోన్ల కోసం కొందరు రైతులు ఆదాయం తక్కువున్నా ఐటీ కడుతున్నారు. అలాంటివారితో పాటు ఐటీ పరిధిలోకి రాని ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com