TS : ఆర్టీసీ డ్రైవర్ల సమ్మె.. మేడారం భక్తులకు ఇబ్బందులు

సందు చూసి స్ట్రైక్ కు దిగారు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు. జనగామ బస్ డిపో లో డ్రైవర్లు బైఠాయించారు. తాము కష్టపడి పనిచేస్తున్నా కూడా.. తమను ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ గుర్తించడం లేదని.. వెంటనే తమకు వేతనాలు పెంచాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు.
మరోవైపు.. తెలంగాణలో మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర మొదలైంది. హైదరాబాద్ నుంచి వయా వరంగల్ మేడారం వెళ్లేందుకు జనగామ బస్సులు చాలా కీలకం. ఈ జాతర కోసం ఆర్టీసీ దాదాపు 6 వేల బస్సులు నడుపుతుంది. ఈ క్రమంలో సగానికిపైగా బస్సులు మేడారం వెళ్లగా.. మిగిలినవి పల్లేలు, పట్టణాలలో తిరగనున్నాయి. ఇదే టైంలో డైవర్లు సమ్మెకు దిగడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జనగామ బస్టాండ్ లో భారీ సంఖ్యలో బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు ప్యాసింజర్లు. రెండేళ్లకు ఓసారి వచ్చే జాతరకు పోదామంటే ఇదెక్కడి నిరసన అంటూ జనం ఫైరవుతున్నారు. ఎక్కువ డబ్బులైనా పర్వాలేదనుకుంటూ ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com