TG : పార్టీ మార్పు వార్తలు అవాస్తవం: సబితా ఇంద్రారెడ్డి

తాను పార్టీ మారుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ( Sabitha Indra Reddy ) తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు Xలో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తనకు కేసీఆర్ ( KCR ) సముచిత స్థానం కల్పించారని, పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్‌లోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని.. కాంగ్రెస్ ప్రభుత్వం సబితాఇంద్రారెడ్డి హోం మంత్రిగా పనిచేశారు. ఇక తెలంగాణ సిద్ధించాక కూడా 2019లో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరగా.. ఆమెకు కేసీఆర్ మంత్రి పదవి అప్పగించారు. అయితే.. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో.. మళ్లీ ఆమె తన సొంత గూటికి వెళ్లనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని.. అతనికి నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమన్నది మాత్రం.. అయితే కాంగ్రెస్ నాయకత్వం కానీ.. సబితా ఇంద్రారెడ్డి కానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com