Fake Links : ఆర్టీసీ ఉద్యోగాలంటూ ఫేక్ లింకులు ఓపెన్ చేయొద్దన్న సజ్జనార్

తెలంగాణ ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలపై ఎండీ వీసీ సజ్జనార్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట ఆన్లైన్ లో వస్తున్న లింకులను నమ్మవద్దని ఆయన కోరారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎండీ వీసీ సజ్జనార్ కీలక అలర్ట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక అంటూ ఆయన ఆప్డేట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3,035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తును టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించిందని సజ్జనార్ తెలిపారు. 3,035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను అందులో ఇచ్చారు. ఐతే.. అవన్నీ ఫేక్. ఆ లింక్ లను ఉద్యోగార్ధులు నమ్మొద్దని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com