Sexual Assault : లైంగికదాడికి పాల్పడిన వ్యాన్ డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష

బాలికపై లైంగికదాడికి పాల్పడిన పాఠశాల వ్యాన్ డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పు వెలువరించారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ వెంకట రమణ వెల్లడించారు.
2022 డిసెంబర్‌లో అమీర్‌పేటలోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న బాలిక(3)పై పాఠశాల వ్యాన్ డ్రైవర్ రామకృష్ణ(44) లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు.
అప్పటి ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదులు తగిన ఆధారాలతో డ్రైవర్‌పై చార్జిషీటు రూపొందించి కోర్టులో దాఖలు చేశారు. కేసు పుర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి అనిత నిందితుడికి 20 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com