Schools Reopen : తెలంగాణలో ఇవాళ స్కూళ్లు రీఓపెన్

Schools Reopen : తెలంగాణలో ఇవాళ స్కూళ్లు రీఓపెన్
X

వేసవి సెలవుల అనంతరం ఇవాళ్టి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. వారికి స్వాగతం పలికేందుకు పాఠశాలల కమిటీలు ఏర్పాట్లు చేశాయి. తొలి రోజే స్టూడెంట్లకు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయనున్నాయి. సీఎం రేవంత్ కొన్ని స్కూళ్లు సందర్శించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. కాగా ఈ విద్యాసంవత్సరం స్కూళ్ల టైమింగ్స్ మారాయి.

జూన్ 19వ తేదీ వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు. బడిబాట ప్రోగ్రాంలో భాగంగా జూన్ 12వ తేదీన తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) స్కూళ్లను పున:ప్రారంభించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల్ని ఉదయం 9 గంటలకే ప్రారంభించనున్నారు. అయితే.. ప్రైవేట్ పాఠశాలల్లో బోధన 8గంటలకే ప్రారంభం అవుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 9.30కు మొదలు కావడంపై పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Tags

Next Story