Karimnagar : కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్‌లో సోదాలు.. రూ.6కోట్లతో వాహనం సీజ్
ఎన్నికల సమయంలో పోలీసులు.. దర్యాప్తు సంస్థల అధికారులు సోదాలతో హల్చల్ చేస్తున్నారు. కరీంనగర్‌లోని (Karimnagar) ప్రతిమ మల్టీప్లెక్స్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వత సోదాలు చేశారు పోలీసులు. శనివారం ఉదయం వరకు సోదాలను కొనసాగించారు. పక్కా సమాచారంతోనే తాము తనిఖీలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ప్రతిమ మల్టీప్లెక్స్ కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందినది. ఈ తనిఖీల్లో రూ.6.65 కోట్ల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదు మొత్తాన్ని పోలీసులు కోర్టులో డిపాజిట్ చేయనున్నారు. ప్రతిమ మల్టీప్లెక్స్‌లోని పార్కింగ్ సెల్లార్ నుంచి డబ్బులు తరలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది గంటల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన మల్టీప్లెక్స్‌లో నగదు సీజ్ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.6కోట్ల 65లక్షలు పట్టుబడటంతో.. నగర సీపీ అభిషేక్ మహంతి స్పాట్ కు వెళ్లారు. ఈ నగదు ఎవరిది.. ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com