TS : ఎన్నికల టైంలో స్మితా సభర్వాల్ మరో ట్వీట్ వైరల్

'అబద్ధం లోపల నిజం ఇదే..' అంటూ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ చేసిన ట్వీట్ ఇంట్రస్టింగ్ గా మారింది. పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించారు స్మితా సబర్వాల్.
తన పనితీరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో.. ప్రస్తుతం ఆమె తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటారు స్మితా సబర్వాల్. ట్రెండింగ్ అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఏప్రిల్ 23న వరల్డ్ బుక్ డే సందర్భంగా ' కల్పన అనేది అబద్ధం లోపల ఉన్న అసలైన నిజం' అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
'ఫిక్షన్ ఈస్ ది ట్రూత్ ఇన్ సైడ్ ది లై' కొటేషన్ ను హైలైట్ చేశారు స్మితా సభర్వాల్. వరల్డ్ బుక్ డే సందర్భంగా ఎన్నో పుస్తకాలను మీ బెస్ట్ ఫ్రెండ్స్ గా మార్చుకోండి. తప్పించుకోవడానికి, ఎక్స్ ప్యాండ్ కావడానికి పుస్తకాలే దోహదపడతాయంటూ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com