TS : మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా శంబీపూర్ రాజు?

TS : మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా శంబీపూర్ రాజు?
X

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం లోక్ సభ నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. తాజాగా మరో నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసింది. మల్కాజిగిరికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, చేవేళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, మెదక్ లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార ను పోటీకి పెట్టాలని ప్రతిపాదించింది.

శంభీపూర్ రాజు ప్రస్థానం ఇదే..

శంభీపూర్ రాజు1980 JAN 4న కుత్బుల్లాపూర్ పరిధి శంభీపూర్ గ్రామంలో జన్మించారు. 2001లో KCR ప్రారంభించిన TRSలో చేరి మండల కోశాధికారిగా వ్యవహరించారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన పాల్గొన్నారు. 2016 RR జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో MLCగా గెలిచారు. 2021 లో మరోసారి MLC అయ్యారు. 2022 నుంచి మేడ్చల్ జిల్లా BRS అధ్యక్షుడిగా ఉన్నారు.

Tags

Next Story