KCRకు దిమ్మతిరిగే షాక్.. కాంగ్రెస్‌లోకి కేకే, మేయర్ విజయలక్ష్మి..?

KCRకు దిమ్మతిరిగే షాక్.. కాంగ్రెస్‌లోకి కేకే, మేయర్ విజయలక్ష్మి..?

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) టైంలో గ్రేటర్ హైదరాబాద్‌లో (Hyderabad) క్రమంగా కారు పార్టీ కనుమరుగవుతోంది. చాలామంది బీఆర్ఎస్ (BRS) పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కేకే కూడా జంప్ కానున్నారని సమచాారం.

ఎంపీ కేశవ రావు ఇంటికి వెళ్లారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ. కేకే తో పాటు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆమె ఆహ్వానించినట్టు సమాచారం అందుతోంది. ప్పటికే కాంగ్రెస్ లో మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్లు చేరిపోయారు. తాజాగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గద్వాల్ విజయలక్ష్మి.. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు రోహిణ్ రెడ్డి కూడా వీరితో పాటు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story