Madhavi Latha : బీజేపీ నేత మాధవీలతకు షాక్

Madhavi Latha : బీజేపీ నేత మాధవీలతకు షాక్
X

బీజేపీ నేత మాధవీలతకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మాధవీలతకు చెందిన విరించి హాస్పిటల్​కు హైకోర్టు నోటీసులిచ్చింది. ఆస్పత్రిలోని వ్యర్థాలను నివాస ప్రాంతాల్లో గుంత తీసి అందులో పూడ్చుతున్నారని రిజ్వాన్ ఖాన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఆస్పత్రిలోని వ్యర్థాలను నివాస ప్రాంతాల్లో గుంత తీసి అందులో పూడ్చుతున్నారనే అభియోగాల కేసులో హైదరాబాద్ ప్రేమ్ నగర్‌లోని విరించి హాస్పిటల్​‌కు నోటీసులు ఇచ్చింది. విరించి హాస్పిటల్​కు వ్యతిరేకంగా ఖైరతాబాద్​కు చెందిన రిజ్వాన్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం చర్యలకు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా, ప్రభుత్వ వాదనల తర్వాతే ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.

ఎంపీ ఎన్నికల్లో గట్టి పోటీ

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాధవీలత తెలంగాణ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీనికి ప్రధాన కారణం ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఒవైసీపై ఆమె పోటీ చేయడమే. బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల బరిలోకి దిగిన మాధవీలత ఒవైసీకి గట్టి పోటీ ఇచ్చింది. పాతబస్తీ వంటి ప్రాంతాల్లో దొంగ ఓట్ల నియంత్రణ విషయంలో ఆమె కీలకంగా వ్యవరించింది. ఆమె దూకుడును చూసి ప్రభుత్వం సెక్యూరిటీని ఇచ్చింది. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శల దాడి చేసి ప్రజలను తనవైపుకు తిప్పుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మాధవీలత పోటీతో ఒవైసీకి ఈసారి మెజారిటీ తగ్గింది.

Tags

Next Story