TS : బీఆర్ఎస్ కు షాక్... కాంగ్రెస్ లో చేరిన ఏపూరి సోమన్న

TS : బీఆర్ఎస్ కు షాక్...  కాంగ్రెస్ లో చేరిన ఏపూరి సోమన్న

ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్ లో చేరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ఏపూరి సోమన్న అటు రాజకీయాల్లో.. ఇటు సాంస్కృ తిక కళా రంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. రాజకీయాల్లో వైఎస్ఆర్టీపీ నేత షర్మిలకు రైట్ హ్యాండ్ గా వ్యవహరించారు.

అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతోనూ కొంతకాలం ప్రయాణించారు. తెలంగాణ ఉద్య మంలో గళగర్జన చేసిన కళాకారుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. ప్రచార సభల్లో ఆడి పాడారు. అయితే.. బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో సోమన్న మళ్లీ కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం సాగింది.

అయితే.. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ లలో సోమన్న కనిపించడంతో ఆ ప్రచారానికి కాస్త బ్రేక్ పడింది. కానీ.. అనూహ్యంగా ఈ రోజు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరిపోయారు సోమన్న. అయితే.. సోమన్న బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ను ఆశించినట్లు తెలుస్తోంది. టికెట్ దక్కకపోవడంతోనే ఆయన ఆ పార్టీని వీడారన్న చర్చ సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story