SI Bhavani Sen Goud : కీచక ఎస్సై.. మొదటి నుంచి ఇంతే!

X
By - Manikanta |20 Jun 2024 12:30 PM IST
మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం కేసులో డిస్మిస్ అయిన కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ వ్యవహారశైలి మొదటి నుంచే వివాదాస్పదంగా ఉంది. ఆయనపై మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి.
2022లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా ఉన్నప్పుడు ఇదే పద్ధతి కొనసాగించాడు. కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతిని లైంగికంగా వేధించాడు. ఎత్తు, కొలతలు చూస్తానంటూ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.
మరో ముగ్గురు కానిస్టేబుళ్లపైనా అత్యాచారం చేసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com