Sitarama Project : సీతారామా ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్

ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యా మలం చేసే సీతారామ ప్రాజెక్ట్ లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. నిన్న అర్థరాత్రి 12 గంటలకు సీతారామ ప్రాజెక్ట్ ట్రయిల్ రస్ ను అధికారులు నిర్వహించారు. ప్రాజెక్టు మోటార్లని ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అశ్వాపురం మండలం బీ.జీ. కొత్తూరు పంప్ హౌస్ ను ఇరిగేషన్ అధికా రులతోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) పరిశీలించారు.
ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. పంప్ హౌస్ వద్ద గోదావరికి మంత్రి తుమ్మల పూజలు చేశారు. గోదావరిజలాలు పర వళ్లు తొక్కుతుండటంతో ఆయన ఒక్కసారిగా పరవశించిపోయారు. ఆనందంతో భూమాతకు సమస్కరించారు. నీటిపారుదల శాఖ అధి కారులకు మంత్రి అభినందనలు తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ వివరాలను డీఈని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వానాకాలంలోనే వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వా యర కు పారేలా యుద్ద ప్రాతిపదికన పనులు సాగుతున్నాయని తెలిపారు.
త్వరగా పనులు పూర్తి చేసి నీటిని అందించాలంటూ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వడమే తన చివరి కోరిక అని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్కు భూమి ఇచ్చిన వారికి పాదాభివందనాలు తెలిపారు. అధికారులు రేయింబవళ్లు కష్టపడ్డారని అభి నందించారు. ఈ పర్షాకాలంలోనే లక్షన్నర ఎక రాలకు సాగునీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రూ.17 వేల కోట్ల అంచనాతో పది లక్షల ఎకరాలకి సాగునీటిని అందించేందుకు సీతారామ ప్రాజెక్టును గత ప్రభుత్వ హయాంలో చేపట్టారన్నారు.
గత ప్రభుత్వంలో ఏడువేల కోట్ల రూపాయలను ప్రాజెక్టు కోసం వ్యయం చేశారు. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు, మహబూ బాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకి సాగునీరు అందనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com