Youtuber Praneeth : పిచ్చి కూతల కీచకుడు ప్రణీత్ హనుమంత్ అరెస్ట్

సోషల్ మీడియాలో రోస్టింగ్ కామెడీ ముసుగులో తండ్రి కూతురుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రణీత్ ను పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
లైవ్ లో తన మిత్రులతో కలిసి వల్గారిటీ, డబుల్ మీనింగ్ మాటలతో ప్రణీత్ టీమ్ రెచ్చిపోవడంపై సోషల్ మీడియా సమాజం వారిపై దుమ్మెత్తిపోసింది. సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేసిన వీరి వ్యవహారంపై హీరో సాయిధరమ్ తేజ్ ముఖ్యమంత్రితో పాటు మరికొంత మంది ప్రముఖుల దృష్టికి సోషల్ మీడియా వేదికగా తీసుకువెళ్లారు.
సోషల్ మీడియాలో ఉన్న స్వేచ్ఛతో ప్రణీత్ గ్యాంగ్ చేస్తున్న జుగుప్సకరమైన డార్క్ కామెడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ప్రణీతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. తండ్రి కూతురు బంధంపై ఆక్రమ సంబంధాలను అంటగట్టేలా కామెంట్స్ చేసిన నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com