Sonia Gandhi : జీవన్ రెడ్డికి సోనియా గాంధీ.ఫోన్

Sonia Gandhi : జీవన్ రెడ్డికి సోనియా గాంధీ.ఫోన్
X

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ ( Sonia Gandhi ) ఫోన్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంతో అలకబూనిన జీవన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నిన్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఈరోజు భట్టి ఢిల్లీకి వెళ్లిన కాసేపటికే అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు. మరోవైపు పార్టీ మారుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని జీవన్ రెడ్డి కొట్టేశారు. పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తనను బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి ఎవరూ సంప్రదించలేదన్నారు. తన ప్రమేయం లేకుండా జరగాల్సిందిన జరిగిపోయిందని చెప్పారు.

Tags

Next Story