TS : తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియాకు ఆహ్వానం

TS : తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియాకు ఆహ్వానం
X

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తొలిసారి అధికారికంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్స వాలకు అట్టహాసంగా సిద్ధమవుతోంది. ఉత్సవాలను ఊరూ వాడా కన్నుల పండువగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఈ వేడుకలకు హాజరవుతున్నారు.

ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ ఉద్యమ కారు లకు ప్రభుత్వం గుర్తింపునిచ్చి అధికారికంగా ఘనంగా సన్మానించనుంది. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో పలు కీలక అంశాల్లో అనూహ్య మార్పులు, చేర్పులకు ఈ ఉత్సవాలను వేదికగా చేసుకోనుంది. పలు కీలక నిర్ణయాలను సర్కార్ ప్రకటించనుందని తెలుస్తుంది.

రాష్ట్ర అధికార గీతంగా జయ జయ హే తెలంగాణ పాటను ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రభుత్వ అధికారిక చిహ్నంతోపాటు తెలంగాణ తల్లి రూపాన్ని సైతం ఆవిష్కరించనుంది. తెలంగాణ ప్రజల దశాబ్దాల నాటి కల నెరవేర్చింది నాటి యూపీఏ ప్రభుత్వమేనని.. ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చొరవ కారణంగానే రాష్ట్రం ఏర్పాటైందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఓ రకంగా తెలంగాణ దేవత సోనియా అన్న స్లోగన్ ఇచ్చేలా ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

Tags

Next Story