TS : జూన్ 2 నాడు వీరికి ప్రత్యేక ఆహ్వానం

TS : జూన్ 2 నాడు వీరికి ప్రత్యేక ఆహ్వానం
X

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ సకల జనులందరికీ గుర్తుండి పోయేలా నిర్వహించబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన తెలంగాణ ఉద్యమకారులను, ప్రాణాలర్పించిన అమరవీరులకుటుంబాలను, కళాకారులను, మేధావులను, ఉద్యమంతోపాటు రాష్ట్ర ఏర్పాటు కోసం క్రియాశీలకంగా వ్యవహరించిన వారినందరినీ ఆహ్వానించనుంది.

ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించే వేడుకలు కావడంతో సహజంగానే ప్రజా ప్రతినిధులకు ప్రముఖంగా ఆహ్వానాలు పంపనుంది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం అందనుంది.

అయితే.. ఈ వేడుకలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు కూడా ఆహ్వానం పలికే అవకాశం ఉందని సమాచారం. ఈ వేడుకలకు వస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

Tags

Next Story