TS : అత్యద్భుతంగా జూన్ 2 వేడుకలు.. రిహార్సల్స్‌లో సీఎస్

TS : అత్యద్భుతంగా జూన్ 2 వేడుకలు.. రిహార్సల్స్‌లో సీఎస్
X

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 2న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. పరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పోలీసుల గౌరవ వందనం, పోలీసులు, విద్యార్థుల పరేడ్ రిహార్సల్స్ ను డీజీపీ రవి గుప్తతో కలసి సీఎస్ పర్యవేక్షించారు.

ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఎన్నికల కోడ్ నేపద్యంలో ఎన్నికల కమిషన్ అనుమతులు కూడా తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ వేడుకలకు సోనియా గాంధీ తో పాటు పలువురు ప్రముఖులు రానుండడంతో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా 2వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీసుల కవాత్ తో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాలు అకట్టుకుంటాయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు సన్మానం చేయడంతో పాటు, రాష్ట్ర గీతాన్ని జాతికి ముఖ్యమంత్రి అంకితం చేస్తారని వెల్లడించారు.

Tags

Next Story