TG : ఓటమితో కుంగిపోవద్దు.. రాకేశ్ రెడ్డికి కేసీఆర్ భరోసా

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పట్టభద్రుల ఎన్నికల ఫలితాలలో అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి సత్తా చాటారని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) అభినందించారు. ఉప ఎన్నిక ఫలితాల అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు.
కేసీఆర్ ఇష్టా గోష్టిగా మాట్లాడారు. పార్టీ ప్రతికూల వాతావరణంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారని తనను కలిసిన నేతలకు చెప్పారు కేసీఆర్. రానున్న రోజులలో ఇదే స్ఫూర్తితో నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. భవిష్యత్తులో పార్టీ ద్వారా బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తపరిచారు.
ముందు ముందు రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం పని చేయాలని కోరారు కేసీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com