Falaknuma Sub Inspector : డ్యూటీలో నిద్రపోయిన ఫలక్‌నుమా సబ్-ఇన్‌స్పెక్టర్

Falaknuma Sub Inspector : డ్యూటీలో నిద్రపోయిన ఫలక్‌నుమా సబ్-ఇన్‌స్పెక్టర్
X

ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ ఏప్రిల్ 12న రాత్రి డ్యూటీలో ఉండగా తన కారులో నిద్రపోతూ కెమెరాకు చిక్కడం వివాదంగా మారింది. ఇది హైదరాబాద్ నగర పోలీసులకు పెద్ద ఇబ్బందికరంగా మారింది. దీనిపై విచారణకు కమిషనర్ ఆదేశించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా సబ్ ఇన్‌స్పెక్టర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పౌరుల ఆగ్రహానికి దారితీసింది. టిఎస్ 09 పిఎ 5460 నంబరు గల పెట్రోలింగ్ కారులో విధులు నిర్వహిస్తున్న ఫలక్‌నుమా పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ ను పి రవికుమార్‌గా గుర్తించారు.

నివేదికల ప్రకారం, కుమార్‌కు శుక్రవారం రాత్రి ఆ ప్రాంతంలో పెట్రోలింగ్-డ్యూటీ కేటాయించారు. ఫలకుమా నుండి అతని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో.. క్షణాల్లోనే ముఖ్యంగా హైదరాబాద్‌లోని వాట్సాప్‌లో ప్రసారం అయ్యాయి. ఫలక్‌నుమా సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రత్యేకించి రాత్రిపూట దోపిడీ నేరాలు జరిగే అవకాశం ఉన్న సమయంలో డ్యూటీలో నిద్రపోవడంపై హైదరాబాద్‌లో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story