TS : చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ లోనే ఉంటా : సుధీర్ రెడ్డి

తన చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ లోనే కొనసాగుతానంటూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (Sudheer Reddy) అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశమే లేదన్నారు. తనను ప్రజలు గెలిపించారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగు తానంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తనకు ఎన్నో అవకాశాలను ఇచ్చి అండగా నిలిచిందని చెప్పారు.
కేసీఆర్ (KCR) కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని విడిచిపెడతానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తనపై దుష్ప్రచారం సాగుతుందని వివరణ ఇచ్చారు. తాను ఎవరితో సంప్రదింపులు జరపలేదని, భవిష్యత్లోనూ అలాంటి ఆలోచనే లేదంటూ వెల్లడించారు. పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని తాను కాదన్నారు. పదవులు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ను (BRS) అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎంత వరకైనా పోరాటం చేస్తామన్నారు. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటామని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి మచ్చ లేదన్నారు.బీఆర్ఎస్ లోనే ఉంటామని, ఇక్కడే కేసీఆర్ కు అండగా నిలబడి ప్రభుత్వంపై పోరు సాగిస్తామని ఎల్బీ సుధీర్ రెడ్డి వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com