TS : ప్రజల మద్దతు మాకే ఉందని రుజువైంది: రేవంత్

తెలంగాణలో 8 ఎంపీ, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో విజయం అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనను ఆశీర్వదించి తమ ఆత్మస్థైర్యాన్ని పెంచారని తెలిపారు. మరింత సమర్థవంతమైన పాలన అందించడానికి ఉత్సాహాన్నిచ్చారని పేర్కొన్నారు. ప్రజల మద్దతు తమకే ఉందని ఈ ఫలితాలతో రుజువైందన్నారు. రేపటితో కోడ్ ముగుస్తుందని, మళ్లీ ప్రజాప్రభుత్వం మొదలవుతుందని రేవంత్ స్పష్టం చేశారు.
వివిధ రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో మన నంబర్ డబుల్ అయింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ తదితర రాష్ట్రాల్లో దాదాపు క్లీన్‌స్వీప్ చేశాం. బీజేపీని ఆదరించిన ఏపీ, ఒడిశా ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీలో చంద్రబాబు అద్భుత ఫలితాలు సాధించారు. అరుణాచల్, ఏపీ, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం’ అని మోదీ వివరించారు.
2023లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన ఇద్దరు బీజేపీ అభ్యర్థులను 6నెలల్లోనే ప్రజలు పార్లమెంట్‌కు పంపించారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిగా ఓడిపోయిన రఘునందన్‌రావుకు అధిష్ఠానం మెదక్ సీటు ఇవ్వగా ప్రజలు ఆదరించడంతో గెలుపొందారు. ఇటు ఈటల అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో ఓటమి చెందారు. అయినా వెనుకడుగు వేయకుండా మల్కాజిగిరి ఎంపీ స్థానానికి పోటీ చేయగా ప్రజలు ఆయనను దీవించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com