TS : పోరాటం వారి బ్లడ్‌లోనే ఉంది: కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ శ్రేణులు

మనీ లాండరింగ్ కేసులో (Money Laundering Case) ఎమ్మెల్సీ కవితను (Kavitha) ఈడీ (ED) అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే, అరెస్టులకు కల్వకుంట్ల కుటుంబం భయపడదని, పోరాటం వారి బ్లడ్‌లో పార్ట్ అంటూ ట్వీట్స్ చేస్తున్నాయి. ‘కాళ్లు ముడుచుకొని కూర్చోవడం రాదు ఆ కుటుంబానికి.. కాలర్ ఎగరేయడం మాత్రమే వచ్చు. ఈ అరెస్టుకు బీఆర్ఎస్ వణికిపోతుందని మీరు అనుకుంటే, మీ అంత పిచ్చోళ్లు లేరు’ అంటూ కవితకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులోని స్పెషల్ జడ్జి నాగ్‌పాల్ బెంచ్ ముందు హాజరుపర్చారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన మనీష్ సిసోడియా, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి తదితరులకు జస్టిస్ నాగ్‌పాల్ కస్టడీ విధించారు. దీంతో కవితకు కూడా కస్టడీ తప్పదని పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కవిత, ఈడీ వినతులపై జడ్జి ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com