Vamsathilak : బేగంపేట ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలి : వంశతిలక్‌

Vamsathilak : బేగంపేట ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలి :  వంశతిలక్‌
X

బేగంపేట పోలీసులు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థి వంశతిలక్‌ ఆరోపించారు. పోలింగ్‌ సందర్భంగా ఉదయం రసూల్‌పురలోని ఘన్‌బజార్‌ వద్ద ఉన్న రెండు కార్లను బీజేపీ శ్రేణులు, పోలీసులు అడ్డుకోగా.. ఒక డ్రైవర్‌ తప్పించుకున్నాడని తెలిపారు. మరో కారును పట్టుకున్నామన్నారు. ఈ సంఘటనపై బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే, అధికార పార్టీకి చెందిన ఆ కారులో డబ్బు సంచి ఉందని, ఎలా వదిలేస్తారని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన బేగంపేట పోలీసులను డిమాండ్‌ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కారును వదిలేసిన సంఘటనపై చర్యలు తీసుకోవాలని తాము కోరగా ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తనతో పరుషంగా మాట్లాడారని, ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తిలక్‌ తెలిపారు. స్వాధీనం చేసుకున్న కారులో తనిఖీలు నిర్వహించలేదని, అధికార పార్టీకి పోలీసులు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Tags

Next Story