TS : ఎమ్మెల్సీ పోరులో తీన్మార్ మల్లన్నదే గెలుపు.. జానారెడ్డి ధీమా

పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఈఎన్నికలు ముగిసేవరకు కార్యకర్తలు విశ్రమించవద్దని మాజీ మంత్రి జానా రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గంలో హాలియ లో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశం లో మాజీ మంత్రి జానా రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే జైవీర్ నియోజక వర్గం పట్టబద్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బీ ఆర్ ఎస్, బీజేపీ పార్టీలు మాయ మాటలు చెప్పి ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారు అని విమర్శించారు.
అసలు బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఈ ఉప ఎన్నిక వచ్చింది అని మల్లన్న అన్నారు. కాంగ్రెస్ పార్టీ నీ తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు అని మళ్ళీ కాంగ్రెస్ ఖాతాల్లో ఎమ్మెల్సీ సీటు పడుతుంది అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com