Telangana BJP : అసెంబ్లీలో తెలంగాణ బీజేపీ రచ్చకు రెడీ

Telangana BJP : అసెంబ్లీలో తెలంగాణ బీజేపీ రచ్చకు రెడీ
X

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో అధికార కాంగ్రెస్ వైఫల్యాలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ప్ర స్తావించాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూ హాన్ని ఖరారు చేసేందుకు ఆ పార్టీ శాసనసభాపక్షం శుక్రవారం సమావేశమైంది. పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ఆవరణలోని బీజేఎల్పీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రభు త్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించారు. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతుండడంపై కూడా చర్చించారు. సభలో బీఆర్ఎస్ ప్రభుత్వవైఫ్యలాలపై పోరాడే స్థితిలో లేదని, కాంగ్రెస్ లోకి ఆ పార్టీ ఎమ్మెల్యేల వలసలతో గులాబీ శాసనసభాపక్షం డీలా పడి పోయిందని, ఈ సమయంలో ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలను బీజేపీ నిర్వర్తిం చాల్సిన అవసరం ఉందని పార్టీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నట్టు తెలిసింది. నిరుద్యోగుల సమస్యలు జాబ్ కేలండర్ విడుదల, రైతు రుణమాఫీ, రైతులకు పంట పెట్టుబడి సాయం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ శాసనసభాపక్ష భేటీ జరగడం ఇదే తొలిసారి కావడంతో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశానికి బీజేపీకి చెందిన 8మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.

Tags

Next Story