TS : తెలంగాణ వాసులకు దుబాయ్ కోర్టు విముక్తి

దేశం కాని దేశం.. కూలీ పనికి పోయి నేరాల్లో ఇరుక్కుపోయిన మనవారికి దుబాయిలో ఎట్టకేలకు ఉపశమనం లభించింది. హత్య కేసులో దుబాయ్‌లో 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఐదుగురికి విముక్తి లభించింది. ఎన్నో ఏళ్ల తర్వాత కుటుంబీకులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం (48), శివరాత్రి రవి (45) అన్నదమ్ములతోపాటు కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ (48), చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి (48), జగిత్యాల జిల్లా మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు (51) 2004లో ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లారు. వెళ్లిన ఆరు నెలల అనంతరం నేపాల్ కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. అక్కడే పని చేస్తున్న జిల్లా వాసులు ఈ ఐదుగురు కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష వేసింది.
తెలంగాణకు చెందిన ఐదుగురికి నేపాల్ వాసి బహదూర్ హత్య కేసులో కోర్టు 25 ఏళ్ల శిక్ష వేసింది. కొన్నేళ్ల కిందట మాజీ మంత్రి కేటీఆర్ హతుని కుటుంబీకులకు రూ.15 లక్షలు ఇచ్చి క్షమాభిక్ష పత్రం రాయించినా.. మారిన నిబంధనలతో కోర్టు కోర్టు ఒప్పుకోలేదు. అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరఫు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. దీనికి అంగీకరించిన దుబాయి కోర్టు ఏడేళ్లు ముందే వారిని విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com