TS : ఫసల్ బీమా అమలుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

TS : ఫసల్ బీమా అమలుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. సాగు రంగంలోని ప్రతికూలతలను తట్టుకుంటూ రైతులకు అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరిందని తెలిపారు. పీఎంఎఫ్బవైలో 2016 నుంచి 2020 వరకు తెలంగాణ ఉన్న విషయం, ఆ తర్వాత నాటి ప్రభుత్వం దాని నుంచి ఉపసంహరించుకున్న తీరుపై సీఎం చర్చించారు.

పీఎంఎఫ్బీవైలోకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరడంతో వచ్చే పంట కాలం నుంచి రైతులు ఈ పథకం నుంచి పంటల బీమా పొందనున్నారని రేవంత్ పేర్కొ న్నారు. పీఎంఎఫ్ఎవైతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని, పంటలు నష్ట పోయి నప్పుడు సకాలంలోనే పరిహారం అందుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమలుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story