TS : ఇవాళ, రేపు కేరళలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ, రేపు కేరళలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కాంగ్రెస్ తరఫున ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పోటీ చేసే వయనాడ్, అలిప్పీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు.
హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కేరళకు బయలుదేరనున్నారు. రేపు రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని కాంగ్రెస్ పార్టీ పేర్కొనింది. ఈ నెల 19వ తేదీన మహబూబ్ నగర్, మహబూబాద్ లో జరిగే బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డికి పొరుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఇమేజ్ పెరిగిపోయింది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. ఇటీవల వైజాగ్‌లో ఏపీసీసీ నిర్వహించిన బహిరంగ సభకు రేవంత్‌రెడ్డి హాజరుకావడంతో విశేష స్పందన లభించింది
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com