TS : రేపు తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన

లోక్‌సభ అభ్యర్థుల పూర్తి జాబితాను కాంగ్రెస్ పార్టీ (Congress Party) రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ముంబైలో ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. కాగా, రాష్ట్రంలో 17 స్థానాలకు గాను ఇప్పటికే 4 స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
తొలి జాబితాలో జహీరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే 13 నియోజకవర్గాలకు సంబంధించి టికెట్ ఆశావహులపై కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఫ్లాష్ సర్వేలు నిర్వహించింది. ఇక బీఆర్‌ఎస్, బీజేపీలు ఇప్పటికే ఎంపీ ఎన్నికలకు ఎక్కువ మంది అభ్యర్ధులను ప్రకటించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com