TS : చేనేత కార్మికులకు రూ. 50 కోట్లు విడుదల

TS : చేనేత కార్మికులకు రూ. 50 కోట్లు విడుదల

చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ. 50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత త్వరలోనే విడుదల చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. గత ఏడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాదాపు రూ.351 కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయి పడింది. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి.

తమకు రావాల్సిన బకాయిలను చెల్లించి ఆదుకోవాలని ప్రస్తుత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పలుమార్లు కార్మికులు, ఆసాములతో చర్చలు జరిపి కార్మికుల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం వెంటనే బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

నేతన్నలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, ఎప్పటికప్పుడు బిల్లులుచెల్లించేలా ఏర్పా ట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. కాగా, ప్రభుత్వం మూడు నెలల్లో సమగ్ర శిక్షా అభయాన్‌ యూనిఫామ్ల తయారీకి సుమారు రూ. 47 కోట్లు ముందస్తుగా చెల్లించింది. నూలు కొనుగోలుకు రూ. 14 కోట్లు విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story