TG : రైతుల రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

TG : రైతుల రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

రైతులకు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు రుణమాఫీని వచ్చే వారం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం గైడ్‌లైన్స్ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ఈ ఫైల్‌కు సీఎం రేవంత్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఆమోదముద్ర పడుతుందని సమాచారం. దాదాపు ₹31 వేల కోట్ల పంట రుణాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 15లోగా ఒక్కో రైతుకు రూ. 2లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. రుణమాఫీలో లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇంజనీర్లకు మినహాయింపు ఉంటుంది.

తెలంగాణలోని రైతులందరికీ 2 లక్షలలోపు ఉన్న పంట రుణాలన్నింటినీ ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. ప్రచారానికి వెళ్లిన ప్రాంతానికి ప్రసిద్ధి చెందిన దేవుళ్లపై కూడా ప్రమాణాలు చేశారు. కాగా.. ఆయన ఇచ్చిన మాట మేరకు.. కసరత్తు ప్రారంభించారు కూడా. అయితే.. ఈ రుణాల మాఫీపై మంత్రివర్గంతో సమావేశం నిర్వహించి.. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.

Tags

Next Story