TS : హాస్పిటల్ బెడ్ పైనుంచే కొండా సురేఖ వీడియో రిలీజ్

తెలంగాణ (Telangana) రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తన అనారోగ్యంపై వీడియో రిలీజ్ చేశారు. గత వారం రోజులుగా ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆమెకు డాక్టర్లు పలు టెస్టులు చేయగా డెంగ్యూ పాజిటివ్‌గా గా తేలడంతో తగిన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
మేడారం జాతర (Medaram Jatara) సందర్భంగా నిత్యం ప్రజల్లోనే ఉంటూ.. జాతర పనులు చూసుకోవడంలో గత వారం ఆమె బిజీగా కనిపించారు. "స్వల్ప జ్వరం వచ్చినప్పుడు కూడా అలానే నా పనిలో మునిగిపోయాను. దీంతో జ్వరం ఎక్కువ అయి డెంగ్యూగా మారిపోయింది. వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్‌తో ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ప్రజల మధ్యకు రాలేకపోతున్నా." అంటూ ఓ వీడియోను షేర్ చేశారు కొండా సురేఖ.
వీడియోలో బెడ్ పైనే ఉన్న ఆమె చేతికి సెలైన్ ఎక్కుతోంది. కనీసం వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకొవాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. దీంతో.. జాతర సమయంలోనూ మంత్రి బెడ్ రెస్ట్ లోనే ఉండనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com