Telangana TET 2024 Hall Tickets : తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ టెట్ 2024 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం అధికారులు టెట్ హాల్ టికెట్లను విడుదల చేశారు. అభ్యర్థులు https://tstet2024.aptonline.in వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తొలిసారి కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షలు జరుగుతున్నాయి.
టెట్ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్నాయి.
కాగా, షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు జూన్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులకు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే 7032901383 నెంబర్ ను సందప్రదించవచ్చని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.ఈ
పరీక్షలకు సుమారు 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com