TG : డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
X
By - Manikanta |6 Jun 2024 1:01 PM IST
సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతీయేటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపడుతూ ప్రమాణ స్వీకారం చేసిన రోజుతోపాటు, ఈ రోజుకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన రోజుగా, సోనియాగాంధీ పుట్టిన రోజుగా పలు విశిష్టతలున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ వేడుకలు సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని.. విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా, మండల కేంద్రాలలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జెండా ఎగురవేయాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com