TS : తెలంగాణలో మళ్లీ ఎండలు .. రానున్న 3 రోజులు జాగ్రత్త

వర్షాలతో ఇటీవల చల్లబడిన రాష్ట్రంలో ఎండలు మళ్లీ మండిపోతున్నాయి. నిన్న చాలా జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా నేరెళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 44.9, హాజీపూర్‌లో 44.5, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేడు ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవొచ్చని చెప్పారు. ఆ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు.
తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది. మే 26 వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మే 22న కుమురం భీమ్ మినహా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం తెలంగాణలోని ఉత్తరాది జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com