TG : గోవధ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలన్న హైకోర్టు

TG : గోవధ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలన్న హైకోర్టు
X

తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర పోలీసులకు గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు పూజించే ఆవులను బక్రీద్ సందర్భంగా వధించేందుకు తరలించకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

దీనిపై స్పందించిన ఏజీ ఇప్పటికే రాష్ట్రంలో జంతుధ నిషేధం చట్టాన్ని అమలు చేస్తామని కోర్టుకు తెలిపారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్టులు పెట్టామని, గోవుల తరలింపు విషయంలో ఇప్పటికే 60 కేసులు పెట్టామన్న పోలీసులు కోర్టుకు వివరించారు.

బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా ఆపాలని బీజేపీ నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags

Next Story