TG : ఎంపీగా గెలిచిన వారసులు వీళ్లే!

TG : ఎంపీగా గెలిచిన వారసులు వీళ్లే!
X

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో వారసులు మెరిశారు. ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు పోటీ చేసినప్పటికీ.. పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్య నడిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ సీట్లు గెలుచు కోగా.. బీజేపీ కూడా 8 స్థానాల్లో గెలుపొందింది.

ఎంఐఎం కూడా ఒక స్థానం గెలుచుకోగా.. బీఆర్ఎస్ ఘోర పరభవాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతల వారసులు బరిలో దిగగా.. భారీ మెజార్జీలతో గెలిచి ఆ విజయాలను బహుమతిగా ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి నల్గొండ నుంచి బరిలో దిగి 5 లక్షలకు పైగా రికార్డ్ మెజారిటీ కొట్టారు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై రికార్డు విజయం సాధించారు.

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వివేక్ కుమారుడు పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య వరంగల్ లో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మీద 2.23 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నాగర్ కర్నూల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు భరత్ ఓటమి పాలయ్యారు. మల్లు రవి 80 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

Tags

Next Story